ప్రాణ స్నేహితుడు. ఏ పని కావాలన్నా ఇట్టే చేసి పెట్టేవాడు. ఇది నిజం కాదు. ఆమె కోసం నటించాడలా. అతడు ఎంతో మంచివాడని అతడితో స్నేహం కుదిరాక నమ్మించి ఇంటికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేయబోయాడు. స్నేహితుడే ఇలా అఘాయిత్యం చేయబోవడంతో ఎలాగో అక్కడి నుంచి తప్పించుకున్నది ఆ యువతి. ఐతే అతడు అంతటితో వదల్లేదు. ఆమె పెళ్లి చేసుకోబోతోందని తెలిసి నేరుగా ఇంటికే వచ్చేశాడు.
అదే అదనుగా తీసుకున్న మణికంఠ ఆమెకు సన్నిహితంగా వున్నట్లు ఫోటోలు తీశాడు. కొన్నిసార్లు వీడియోలు కూడా తీసుకున్నాడు. అదంతా స్నేహమే అనుకున్నది. కానీ ఆమె ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు. స్నేహితుడే కదా అని ఇంటికి వెళితే ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. దాంతో అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చేసింది.
ఆ తర్వాత అతడితో దూరంగా వుంటోంది. ఉద్యోగంలో చేరి తన జీవితం తను గడుపుతోంది. ఇటీవలే ఆమెకి తల్లిదండ్రులు సంబంధం చూసారు. ఈ విషయం తెలుసుకున్న మణికంఠ మార్చి 25న ఆమె ఇంటికి వెళ్లి తననే పెళ్లి చేసుకోవాలంటూ వాగ్వాదానికి దిగాడు. తనను చేసుకోపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. మళ్లీ ఏప్రిల్ నెలలో అదేవిధంగా చేయడమే కాకుండా తన వద్ద వున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించడంతో బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని వాచిరిస్తున్నారు.