ఇటీవల ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం స్కామ్‌లో తన పాత్ర కూడా ఉందని ఆరోపణలు చేసిన భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలపై తెరాస ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేశారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లా కోర్టుల్లో ఆమె ఈ పరువు నష్టం దావా పిటిషన్లను దాఖలు చేశారు.
తన తండ్రిని బద్నాం చేయడానికి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందార్ సింగ్‌లు సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై చేసిన ఆరోపణలు సంచలనమై చర్చనీయాంశంగా మారాయి.
చెప్పిన విధంగానే వీరిపై ఆమె పరువునష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లా కోర్టులలో ఆమె పరువునష్టం దావా వేశారు. మరోవైపు సోమవారం కవిత ఇంటి వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టిన 29 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ నరేందర్ తెలిపారు.