పూర్తి వివరాలను చూస్తే... కరీమాబాద్ 23వ డివిజన్లో ఎస్ఆర్ఆర్ తోటకు చెంది భాస్కర్ ఆటోడ్రైవరుగా జీవిస్తున్నాడు. ఇతడికి భార్య విజయ, 13 ఏళ్ల కుమారుడు వున్నారు. ఐతే ఈమధ్య తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవి తారాస్థాయికి చేరడంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది భార్య.
మంటలతో పరుగెత్తుకుంటూ వచ్చి భార్య విజయను గట్టిగా పట్టుకున్నాడు. మరో మహిళ వారించేందుకు ప్రయత్నించగా ఆమెను కూడా పట్టుకోబోవడంతో ఆమె తప్పించుకుని పరుగులు తీసింది. మంటలు చెలరేగడంతో ఇద్దరూ ఆర్తనాదాలు చేస్తూ అక్కడికక్కడే మంటల్లో కాలి ప్రాణాలు విడిచారు. కుమారుడి జన్మదిన వేడుకల చేసుకుంటున్న తల్లిని దారుణంగా చంపడమే కాకుండా అతడూ చనిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.