"నర్రా" వెంకటేశ్వరావు మృతికి సినీ ప్రముఖుల నివాళి

ప్రముఖ సినీ నటుడు నర్రా వెంకటేశ్వరరావు (62) ఆదివారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్రా ఆదివారం ఉదయం ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడిన నర్రా ఆదివారం ఉదయం 5.30 నిమిషాలకు మరణించారు.

సుమారు 500 చిత్రాల్లో నటించిన నర్రా 1947లో ప్రకాశం జిల్లా అగ్రహారంలో జన్మించారు. "మల్లెల మనసులు" చిత్రం ద్వారా పరిచమైన నర్రా.. మొదట విలన్‌గా రంగప్రవేశం చేసి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్‌గా ప్రేక్షకుల ఆదరణ చూరగొన్నారు. కాగా నర్రా చివరి చిత్రం మేస్త్రీ. ఆదివారం నర్రా అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరుగుతాయి.

నర్రా మరణవార్తను విన్న వెంటనే సినీ ప్రపంచంలో దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. సినీ ప్రముఖులంతా నర్రా వెంకటేశ్వర రావుకు సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా స్వగృహంలోని ఆయన భౌతికకాయానికి యావత్తు సినీ ప్రపంచం ఘన నివాళులర్పిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి