అంజలిపై మరో రూమర్: కమెడియన్ సతీష్‌తో పెళ్లైపోయిందట!

మంగళవారం, 16 డిశెంబరు 2014 (11:48 IST)
అందాల అంజలిపై గత కొంత కాలంగా ఏదో ఒక వివాదం నెలకొంటూనే వుంది. ఎప్పుడూ ఏదోఒక రూమర్‌తో ఆమె వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. తాజాగా తమిళ కమెడియన్ సతీష్‌ను ఆమె వివాహం చేసుకుందని ఒక్కసారిగా కోలీవుడ్‌లో ప్రచారం మొదలైంది. ఇటీవలి కాలంలో సతీష్ కమెడియన్‌గా బాగా ఎదుగుతున్నాడు. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. 
 
ఇదే విషయం ఈ తమిళ నటుడి వద్ద ప్రస్తావిస్తే, పెద్దగా నవ్వేస్తూ, "అసలు అంజలిని నేనింతవరకు ఒక్కసారి కూడా కలవలేదు. ఆమెను సినిమాలలో చూడడం తప్ప ఆమెతో నాకు అసలు పరిచయమే లేదు. మరి, ఈ వార్తని ఎవరు పుట్టించారో!" అంటున్నాడు. మరి అంజలి ఈ రూమర్‌పై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి