జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున దీనిని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసేస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడని దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి కూడా అలాగే పనిచేశాడు. చిత్రాన్ని లేట్ చేసేస్తున్నాడంటూ ఎన్ని విమర్శలు వచ్చినా, సంతృప్తికరంగా వచ్చేవరకు సైలెంటుగా తన పని తాను చేసుకున్నాడు.
ఇప్పుడు చిత్రం ఒక 'ఐ' ఫీస్ట్ గా వుందని కోలీవుడ్ టాక్. తెలుగు, తమిళ భాషల్లో 'ఐ' పేరుతోనే దీనిని రిలీజ్ చేస్తున్నారు. విక్రం, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించాడు.