బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో రైలు పట్టాల పక్కనే యువతిపై అత్యాచారం చేసి హత్య

ఐవీఆర్

శుక్రవారం, 21 జూన్ 2024 (20:55 IST)
బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని యువతి మృతదేహం రైలు పట్టాల పక్కనే పడి వుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. యువతి శరీరంపై తీవ్రమైన గాయాలతో పాటు ఆమెపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. మృతురాలు నెల్లూరు జిల్లా వాసిగా ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుసుకున్నారు. నెల్లూరు వాసి అయిన సుచరిత ఇక్కడకు ఎలా వచ్చింది, ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
 

ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఈపూరుపాలెం వెళ్ళిన హోంమంత్రి అనిత గారు బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి వేగవంతంగా దర్యాప్తు… pic.twitter.com/tG9SdGfcQ7

— Telugu Desam Party (@JaiTDP) June 21, 2024
కాగా సుచరితపై అత్యాచారం, హత్య ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర హోంమంత్రి అనితను ఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని ఆదేశించారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు హోంమంత్రి ఈపూరుపాలెంకు బయలుదేరి వెళ్లారు. మరోవైపు ఇటీవలే రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. ఈ సందర్భంగా ఈపూరుపాలెంలో జరిగిన హత్య ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకుని నిందితులను అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు