గోపీచంద్ లౌక్యం మూవీ కథ ఏమిటి...?

శుక్రవారం, 26 సెప్టెంబరు 2014 (17:19 IST)
లౌక్యం నటీనటులు: గోపీచంద్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, పోసాని, చంద్రమోహన్‌, బ్రహ్మానందం, ముఖేష్‌రుషి, రఘుబాబు తదితరులు; కెమెరా: వెట్రి, సంగీతం:అనూప్‌ రూబెన్స్‌, మాటలు: కోన వెంకట్‌, గోపీమోహన్‌, స్క్రీన్‌ప్లే, కోన వెంకట్‌, కథ: శ్రీధర్‌ సిపాన, దర్శకత్వం: శ్రీవాస్‌, నిర్మాత: ఆనంద్‌ ప్రసాద్‌.
 
మార్కెట్‌లోకి వచ్చిన సరుకుకు డిమాండ్‌ వుంటే.. డిమాండ్‌ సప్లై పరిస్థితి వస్తుంది. అదే వస్తువును మరొకడు అచ్చం అలాగే వుండేలా తయారుచేస్తాడు. అదేమంటే అది వ్యాపారం అనే లాజిక్కు చూపిస్తాడు. ఇందుకు సినిమా రంగం ఏమీ మినహాయింపు కాదు. ఒక సినిమా విజయవంతం అయితే అదే బాపతు చిత్రాలు వరుస కడతాయి. దానికి రచయితలు తమ పెన్నుకు పనిచెబుతారు. రాత్రింబవళ్ళు సిగరెట్లు తాగి మైండ్‌కు పని కల్పిస్తారు. కథ పాతదే అయినా ఏదో కొత్తదనం చూపించాలని తహతహలాడుతారు. అటువంటి కోవలోనిదే 'లౌక్యం'. గోపీచంద్‌ కథానాయకుడిగా ఏడాదికి పైగా గ్యాప్‌ తీసుకుని సీరియర్స్‌ రచయితల చేత కథ రాయించుకుని స్క్రీన్‌ప్లే చేయించుకుని తీసిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథగా చెప్పాలంటే.... వరంగల్‌లో బాబ్జీ అనే రౌడీ చెల్లెలి పెండ్లికి సిద్ధమవుతుండగా లాక్కుపోతాడు వెంకటేశ్వర్లు(గోపీచంద్‌). ఆమె ప్రేమించిన వ్యక్తి చేతిలో పెడతాడు. చెల్లెలుపై ప్రేమతో తీసుకువెళ్ళిన వాడిపై కసితో ఊరంతా అనుచరులతో వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ సెల్ఫీ (బ్రహ్మానందం) కారులోనే ట్రావెల్‌ చేస్తూ తిరుగుతుంటారు. ఈలోగా బాబ్జీ మరో చెల్లెలు చంద్రకళ (రకుల్‌ ప్రీత్‌సింగ్‌) తొలిచూపులోనే ప్రేమలో పడతాడు వెంకటేశ్వర్లు. బాబ్జీ ప్రత్యర్థులు ముఖేష్‌రుసి ఓరోజు చంద్రకళపై ఎటాక్‌ చేస్తారు. ఇది తెలిసిన బాబ్జీ తన ఇంటికి తీసుకువచ్చి.. తననుక్ను భరత్‌కు ఇచ్చి పెండ్లి చేయాలనుకుంటాడు. మరి హీరో ఊరుకుంటాడా? అందరినీ బురిడీ కొట్టించి తన తెలివితేటలతో(లౌక్యం) ఎలా సాల్వ్‌ చేశాడు? అన్నది కథ.

వెబ్దునియా పై చదవండి