సూర్య రాక్షసుడు భారీ నష్టాలు తేల్చాడా...?

శనివారం, 6 జూన్ 2015 (19:49 IST)
గజని, యముడు వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు చేసిన తమిళస్టార్‌ సూర్య.. ఒక్క దెబ్బతో నిర్మాతకు నష్టాలు పాలుచేశాడని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. తమిళంలో ఆయన నటించిన చిత్రం 'మాస్‌'. తెలుగులో 'రాక్షసుడు'. అక్కడ యావరేజ్‌గా, ఇక్కడ పెద్దగా ఆదరణ లేకుండా నడుస్తోంది. స్టూడియోగ్రీన్‌ సంస్థ సగర్వంగా సమర్పిస్తుంది అని ప్రతిసారీ చెబుతున్నట్లే ఈసారి చెప్పింది. అయితే ఇందులో ఆత్మల ఎపిసోడ్‌.. తెలుగువారికి పెద్దగా నచ్చలేదు. 
 
చనిపోయినవారు ఒక వ్యక్తికే కనపించడం.. వారు వారి కోరికలు తీర్చుకోవడం అనేది హాలీవుడ్‌ చిత్రాల్లో వర్కవుట్‌ అయిందని విశ్లేషకులు అంటున్నారు. తొలి ఆట రోజునే చిత్రం లాభం లేదని పేరు తెచ్చుకుంది. దాదాపు 60 కోట్లు ఖర్చయిందని చెబుతున్న ఈ చిత్రం సగం కూడా వసూలు చేయలేకపోవడంతో ఈ చిత్రం భారీ నష్టాన్నే మిగిల్చిందని ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి