ఆంజనేయుల్ని పెళ్లిచేసుకోను: మనసు మార్చుకున్న అనన్య!
మంగళవారం, 27 మార్చి 2012 (12:33 IST)
FILE
జర్నీచిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన అనన్య.. ఆంజనేయులు అనే పారిశ్రామికవేత్తతో ప్రేమాయణం సాగిస్తూ ఆయనతో ఏడడుగులు నడవడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. వీరి ప్రేమ మొదట ఇరు కుటుంబాల పెద్దలు సమ్మతించడంతో నిశ్చితార్థం కూడా జరిగింది.
అయితే ఆ తరువాత కథ అడ్డం తిరిగింది. ఆంజనేయులకు ఇంతకుముందే పెళ్లి అయ్యిందని తెలిసిన అనన్య తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ పెళ్లి జరగదంటూ ఆంజనేయులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఆయన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టింది అనన్య.
అయితే ఇప్పుడు మనసు మార్చుకుంటున్నట్లు తెలిసింది. ఆమె ఆంజనేయులుకు షాక్ ఇచ్చేలా ఒక ప్రకటన ఇచ్చింది. తాను సినిమాలో సాధించాల్సింది చాలా ఉందని అనన్య పలికింది.
ఇంకా తమిళ పరిశ్రమలో తాను విజయ్, అజిత్ లాంటి గొప్ప స్టార్స్‌తో కలిసి నటించాలని ఆ తరువాతే పెళ్లి అని ప్రకటించింది. దీంతో ఆంజనేయులుకు దిగ్భ్రాంతి కలిగించిన అనన్య తన తల్లిదండ్రులకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని సమాచారం.