తన జీవిత భాగస్వామి మోసగాడని తెలిస్తే... అతగాడిని వివాహం చేసుకునేందుకు ఏ ఆడపిల్లా సాహసించదు. కానీ. "జర్నీ" ముద్దుగుమ్మ మాత్రం దీనికి మనహాయింపు. ఒక్కసారి కమిట్ అయితే.. నా మాట నేనే వినను అనే టైప్. అందుకే.. గతంలో నిశ్చితార్థం జరిగిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆంజనేయన్‌నే వివాహం చేసుకుంటానని మంకుపట్టు పట్టింది.
ప్రస్తుతం మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న అనన్య.. ఆంజనేయులు అసలు స్వరూపం తెలిసినప్పటికీ.. తన తల్లిదండ్రులు, బంధువులు, హితులు, స్నేహితులు వద్దన్నా.. తాను మాత్రం ఆంజనేయన్‌ను మాత్రమే పెళ్లాడతానని ఆయనతో త్వరలోనే పెళ్లి జరుగనుందని చెప్పింది.
ప్రస్తుతం తాను మలయాళంలో దిలీప్ సరసన "నాడోడి మన్నన్" చిత్రంలోను అదేవిధంగా హీరోయిన్‌కు ప్రాముఖ్యతగల ఆయన అనే చిత్రంలోను, పృద్విరాజ్‌కు జంటగా మరో చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది. ఇందులో మరో హీరోగా శరత్‌కుమార్ నటిస్తున్నారని తెలిసింది.