సినిమా ఇండస్ట్రీలో నటీ నటులు అవకాశాల కోసం ఎంతకైనా తెగిస్తారని వింటుంటాం. ఇంకా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వారు అవకాశాల కోసం అర్రులు చాచుకుని కూర్చుంటారు. ఇదే అదనుగా సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కావాలంటే.. తనతో గడపాల్సిందేనని దర్శక-నిర్మాతలు అంటుంటారు. ఏ సినిమా రంగంలోనైనా హీరోయిన్‌గా రాణించాలంటే అందం అభినయం ఉంటే మాత్రం సరిపోదు.
చాలామంది కోరికని తీర్చాల్సిన పరిస్థితి అంటూ ఎంతో మంది తెరవెనక చెప్పుకోలేక బాధపడుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని స్టార్ హీరోయిన్‌గా ఎదిగాక చాలామంది ముద్దుగుమ్మలు బహిరంగంగా బయటపెట్టారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఓ వెలుగు వెలుగుతోన్న చాలా మంది ముద్దుగుమ్మలు.. మొదటి ఛాన్స్ కోసం ఇలాంటి సంఘటనలని ఎదుర్కొన్న వాళ్లే.
అయితే, ఇలాంటి సంఘటనలపై కొందరు ముద్దుగుమ్మలు మాత్రమే ఓపెన్ అవుతారు. తాజాగా, కన్నడ నటి ప్రియాంక ఎం జైన్ ఓపెన్ అయ్యింది. కొన్ని సంచలన విషయాలని బయటపెట్టింది. సినిమా ఛాన్స్ కోసం వస్తే.. నిర్మాత, దర్శకుడు తమతో రిలేషన్ పెట్టుకోవాలనే కండిషన్స్ పెట్టారట. ఇటీవలే ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలని బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి వేధింపుల వల్లే తాను మూడు సినిమాలు వదిలేశానని చెప్పుకొచ్చింది.
సినిమా రంగంలో స్థిరపడాలంటే ఇలాంటివి తప్పవని, పడక సుఖం కోసం ఎంతటి దుర్మార్గానికైనా దిగజారతారని అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అటువంటి ఆత్రంగా చూసేవాళ్లు ఇక్కడ చాలామంది ఉన్నారని అంటోంది. ఇంతకీ ఫస్ట్ సినిమా విషయంలో అటువంటి సంబంధం పెట్టుకొందా.. ? అలాంటిదేమీ లేదట. నేను అలాంటిదానిని కాదని అంటోంది. మొత్తానికి.. ఛాన్స్ కోసం కావాలంటే కోరిక తీర్చాల్సిందేననే సమస్యని ఫేస్ చేసిన లిస్టులో మరో హీరోయిన్ చేరిపోయింది.