సీఎంతో చిందులేసేందుకు దేవసేన రెడీ... రూ.2కోట్లు తీసుకుందట..

మంగళవారం, 18 జులై 2017 (11:47 IST)
బాహుబలి సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించిన దేవసేన అదేనండి.. అనుష్క.. మార్కెట్ భారీగా పెరిగిందట. అమ్మడు పారితోషికం రేటు కూడా భారీగా పెరిగిందట. ప్రస్తుతం అమ్మడు రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు పారితోషికం పుచ్చుకుంటుందట. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ''భరత్ అనే నేను'' సినిమాలో అనుష్క ఓ పాటకు చిందులేయనుందట. ఈ పాట కోసం అనుష్కకు రూ.2కోట్లు ఇచ్చారట. 
 
ఐటమ్ సాంగుకు అంత మొత్తంలో అనుష్క పారితోషికంగా తీసుకోవడం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సీఎంగా నటిస్తున్నారు. మహేష్ బాబ- అనుష్క కలిసి ఈ చిత్రంలో ఓ పాటకు చిందులేయనున్నారు. ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.
 
శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని అందించిన దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు చీఫ్ మినిష్టర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 'జనతా గ్యారేజ్'లో ''నేను పక్కా లోకల్.. పక్కా లోకల్'' అని కాజల్ అగర్వాల్ చేత స్టెప్పేయించిన డైరెక్టర్ కొరటాల ఇప్పుడు భరత్ అనే నేను సినిమాలో ఐటం సాంగ్ కోసం అనుష్కని ఖరారు చేసినట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి