బాలయ్యను ఎలా చూపించాలో ఆయన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో..? బాలయ్యతో ఎలాంటి సినిమా తీస్తే... సక్సెస్ అవుతుందో బోయపాటికి బాగా తెలుసు. అందుకనే బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో మూవీ అనగానే ఓరేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉంటే... బాలయ్య తదుపరి చిత్రం గురించి ఓ వార్త బయటకు వచ్చింది. విషయం ఏంటంటే... నెక్ట్స్ మూవీని కూడా ఫైనల్ అయినట్టు గత కొన్ని రోజులుగా ప్రచారమవుతోంది. బాలయ్యతో లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు.. ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన బి.గోపాల్ దర్శకత్వంతో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారని తెలిసింది. అయితే... సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ యంగ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తుంటే... బాలయ్య మాత్రం అవుట్‌డేట్డ్ డైరెక్టర్‌తో సినిమా చేయడం ఏంటి అనే చర్చ జరుగుతుంది.
బాలయ్య అభిమానులు సైతం షాక్ అవుతున్నారట. బి. గోపాల్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పడంతో పాటు... ఏకంగా ఈ సినిమాకి ముహూర్తం కూడా ఖరారు చేశారని... జూన్ 10న తన పుట్టిన రోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాని ప్రారంభించాలి అనుకుంటున్నారని సమాచారం. మరి.. ఈ సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ బాలయ్యతో సినిమా తీసి ప్రేక్షకులను మెప్పిస్తారా..? మరో హిట్ అందిస్తారా..? లేదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.