ఈ శుక్రవారమే విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా గురించి ఇండస్ట్రీతోపాటు ప్రేక్షకులుకూడా పెదవి విరుస్తున్నారు. ఏదో వుంటుందని.. ఉత్సాహంగా.. వున్న ఇండస్ట్రీలోని పెద్దలు ఈ చిత్రం రిపోర్ట్ తెలుసుకుని నిరాశపడ్డారు. గురువారం రాత్రి ఐమాక్స్‌లోనూ, శుక్రవారంనాడు ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఇండస్ట్రీ ప్రముఖులకు, మహేస్ కుటుంబసభ్యులకూ చూపించారు. చూసినవారంతా.. బాగానే వుందంటూ పైకి అంటున్నారేకానీ.. ఎక్కువ రోజులు ఆడదనే నిర్ణయానికి వచ్చారు. అందుకు కారణం అందులో సరైన కథ లేకపోవడమే.
సినీ పెద్దలు విశ్లేషణ ప్రకారం... సత్యరాజ్ పాత్రను చంపేయడంతోటే.. సినిమా స్టఫ్ పోయింది. ఇక హీరో ఆయన బాధ్యతలు నిర్వహించాల్సిందిపోయి.. ఏడు తరాలంటూ.. ముగింపు వరకు తిరగడం.. కాలక్షేపంగా వుందికానీ.. ఎక్కడా హీరోయిజం లేదు. తను చేసే నటన కూడా పెద్దగా లేదు. సీతమ్మవాకిట్లో.. కథ, నటన అన్నీ వున్నాయి. ఇందులో సరైన కథ లేకపోవడం మైనస్‌గా భావిస్తున్నారు. ఇక దీనికి తోటు.. విడుదలైన రోజే కలెక్షన్లపరంగా.. చిత్ర యూనిట్ లెక్కలు చెబుతోంది. కృష్ణాలో 75లక్షల షేర్, పశ్చిమగోదావరిలో 90లక్షల షేర్ అంటూ.. లెక్కలు చెబుతున్నా... ఆదివారం తర్వాత.. సినిమా పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.