భారత క్రికెట్ జట్టు బౌలర్ జస్ప్రీత్ బుమ్రా డేటింగ్‌లో ఉన్నారా? ఆయన డేటింగ్‌లో ఉన్నది ఎవరితోనో తెలుసా? మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. ఈ వార్తలను ఈమె ఖండిచకపోగా, బుమ్రా తనకు మంచి ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది.
నిజానికి గతంలో జస్ప్రీత్ సింగ్ బుమ్రా హీరోయిన్ రాశీఖన్నాతో డేటింగ్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపించాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాసీఖన్నా క్లారిటీ ఇచ్చింది కూడా. బుమ్రా ఎవరో తనకు వ్యక్తిగతంగా తెలియదని, తానెప్పుడూ అతడిని కలవలేదని తెలిపింది. బుమ్రా క్రికెటర్ అని మాత్రం తనకు తెలుసని పేర్కొంది.