ఈ టైటిల్‌తో గతంలో తెలుగులో డబ్బింగ్ సినిమా వచ్చింది. సహజంగా వయస్సు పైబడిన వారు పెండ్లి చేసుకుంటే.. ఆ పదాన్నే వాడతారు. ప్రస్తుతం ఓ హీరోకు అదే పరిస్థితి అంట. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రకటించగానే.. సోషల్ మీడియాలో.. వాట్సప్‌లో ఆ జంట గురించి పైవిధంగా కామెంట్లు కొడుతున్నారు. రకరకాల కామెంట్లతో హల్‌చల్ చేస్తున్నారు.
ముసలి హీరోకు, ముతక దర్శకుడితో ముష్టి ఎత్తుకొచ్చిన కథతో.. పడుచు పెళ్ళాం చేస్తున్న సినిమా... అంటూ కామెంట్లు వస్తున్నాయి. కాగా, ఈ విషయంలో అమితాబ్, రజనీకాంత్‌లను పోలుస్తూ... వయస్సుకు తగ్గ పాత్రలతో హుందా అయిన కథలతో.. హీరోయిన్ గురించి పట్టించుకోని చిత్రాలు చేయడం విశేషంగా చెబుతూ... తెలుగు హీరోలు నేర్చుకోవాల్సింది చాలా వుందనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇంతకీ కాజల్ అగర్వాల్ వయసు ఎంతంటే... 31 సంవత్సరాలు. చిరంజీవి వయసు 60 సంవత్సరాలు. అదీ సంగతి.