దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 70 ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్ ఖరారు చేశారు. మహి వి. రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. రీల్ లైఫ్ వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక నటిస్తున్నారని తెలిసింది. ఇక వైఎస్ తనయుడు, వైకాపా చీఫ్ జగన్ పాత్ర గురించి సోషల్‌మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.