యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం 'సలార్' సినిమా రెగ్యులర్ షూటింగ్‌పై దూకుడు పెంచాడు. హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.