తాజాగా అలాంటి సన్నివేశంలో నటించడంపై కైరా అద్వానీ నోరు విప్పింది. హస్తప్రయోగానికి సంబంధించిన ఆ దృశ్యంలో నటించాల్సిన పరిస్థితి. ఆ సీన్ కోసం దర్శకుడు తనకు సూచనలు చేశాడని, హావభావాలు సరిగ్గా వుండాలని చెప్పినట్లు కైరా తెలిపింది.
ఇంకా సినిమా అవకాశాల గురించి కైరా అద్వానీ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా పరాజయం పాలైనప్పుడు, తనను చూస్తే పారిపోయారు. అలాంటి వాళ్లంతా తనకు సక్సెస్ వచ్చిన తరువాత వెంటపడుతున్నారు. అలాగని చెప్పేసి తాను ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు. తనకు నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను. అన్ని భారతీయ భాషల్లోను నటించాలనేది తన ఆశ అంటూ కైరా అద్వానీ చెప్పుకొచ్చింది.