సాధారణంగా సినీ ఛాన్సులు కావాలంటే... తమతో పడక షేర్ చేసుకోవాలని మహిళలను నిర్మాతలో, దర్శకులో అడగటం చూశాం. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. ఓ బాలీవుడ్ యంగ్ నటుడిని.. మహిళా నిర్మాతలు ఆడుకున్నారట. ఛాన్స్ కావాలంటే.. తమతో రాత్రుళ్లు గడపాలని ఆఫర్ చేశారట. అయితే వాటికి తలొగ్గని ఆ నటుడు.. తనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. అతడెవరో కాదు.. బాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ బిస్త్.
అవకాశాల కోసం పడక గదికి పిలిచే అలవాటు ఇంకా వుందని.. సినీ ఛాన్సుల కోసం వెతుక్కుంటూ వెళ్ళిన సందర్భాల్లో చాలామంది మహిళా నిర్మాతలు తనను బెడ్‌ను షేర్ చేసుకోవాలని పిలిచినట్లు ఆశిష్ బిస్త్ వెల్లడించాడు. ముంబైకి వచ్చిన రోజుల్లో అవకాశాల వెల్లువల్లా రావాలంటే.. తమతో ఉల్లాసంగా గడపాలని ఆఫర్ చేశారని తెలిపాడు. అయితే వీటికి తాను ఒప్పుకోలేదని.. ప్రస్తుతం అనూహ్యంగా తనకు ఆఫర్లు వస్తున్నాయని తెలిపాడు. 29 ఏళ్ల ఆశిష్.. ఏమాత్రం జంకుబొంకు లేకుండా.. బాలీవుడ్ నిర్మాతలపై ఓపెన్‌గా చెప్పేయడం వివాదానికి దారితీసింది.