పొడచూపిన విభేదాలు... అక్కినేని అఖిల్, శ్రియాభూపాల్ పెళ్లి క్యాన్సిల్?

బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (11:32 IST)
అక్కినేని నాగార్జున కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని, ప్రముఖ డిజైనర్ శ్రియా భూపాల్‌ల పెళ్లి రద్దు అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వరుడు, వధువు మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఈ వివాహాన్ని వారిద్దరు క్యాన్సిల్ చేసినట్టు ఇపుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా ఉంది.
 
వాస్తవానికి ఇటీవలే అఖిల్, శ్రియా భూపాల్‌ల నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఇపుడు వీరి వివాహం క్యాన్సిల్ అయిందనే సంచలన వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. పెళ్లి ఎందుకు రద్దు అయిందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే అఖిల్, శ్రియాల మధ్య మనస్పర్థలు తలెత్తాయని, వివాహం క్యాన్సిల్ కావడానికి ఇదే కారణమని కొందరు చెబుతున్నారు. 
 
ఇరు కుటుంబాల పెద్దలు అఖిల్, శ్రియాలతో మాట్లాడారని అయినా ఫలితం లేకపోవడంతో, వివాహాన్ని రద్దు చేశారని సమాచారం. వీరిద్దరి పెళ్లి మే నెలలో ఇటలీలో జరగాల్సి ఉంది. పెళ్లి నేపథ్యంలో, హోటళ్లు, రిసార్టులు బుక్ చేయడం కూడా జరిగింది. కానీ, చివరకు ఈ తతంగం ఓ షాకింగ్‌గా ముగిసింది. అయితే, ఈ వార్తపై అక్కినేని కుటుంబం లేదా శ్రియా భూపాల్ ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

వెబ్దునియా పై చదవండి