'పుష్ప'ను అడవిలో ఓ ఆటాకుంటానంటున్న హీరోయిన్...

గురువారం, 23 ఏప్రియల్ 2020 (19:16 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం "పుష్ప". చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో ఎర్రచందనం అక్రమరవాణా ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. 
 
ఇందులో ఓ హీరోయిన్‌గా నివేదా థామస్‌ను ఎంపిక చేశారు. ఈమె అల్లు అర్జున్ ప్రియురాలిగా నటించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రధాన హీరోయిన్‌గా రష్మిక మందన్నాను ఎంపిక చేశారు. 
 
అయితే, పుష్పలో తన పాత్రపై నివేదా థామస్ స్పందిస్తూ, అల్లు అర్జున్‌ హీరోగా నిర్మితమయ్యే పుష్పలో ఎంపిక చేసినందుకు చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు తెలిపింది. పైగా, ఈ చిత్రంలో బన్నీ ప్రియురాలిగా కనిపించే అవకాశం ఉందన్నారు. 
 
తమ ఇద్దరి మధ్య సన్నివేశాలు ఖచ్చితంగా అటవీ ప్రాంతంలోనే చిత్రీకరించే అవకాశం ఉందని, ఆ సమయంలో అల్లు అర్జున్‌ను అడవిలో ఓ ఆట ఆడుకుంటానని చెప్పుకొచ్చింది. 
 
కాగా, నివేదా థామస్ అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రల్నిఎంచుకుంటూ ముందుకుసాగిపోతోంది. తన తొలి సినిమా నుంచి వైవిధ్యతకు పెద్దపీట వేస్తూ సినిమాలు చేస్తున్న నివేదాకు.. సుకుమార్ చిత్రంలో ఆఫర్ వరించడం ఓ గోల్డెన్ ఛాన్స్ వంటిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు