రాయ్ లక్ష్మి.. ఈ పేరు వినగానే ముందుగానే కాంచన సినిమా గుర్తుకొస్తుంది. లారెన్స్ పక్కన ఈ మిల్క్ బ్యూటీ చేసిన క్యారెక్టర్ ఆ సినిమాకే హైలెట్. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించి కనిపించకుండా పోయింది. కారణం ఆమె ఈ మధ్య ఐటెం సాంగ్స్‌లో నటించడమే. ఐటెం సాంగ్స్‌లో నటించడం కారణంగా లక్ష్మీకి అవకాశాలు తగ్గిపోతున్నాయని సినీవర్గాలు కోడై కూస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో తక్కువ డబ్బులను తీసుకునే వారిలో రాయ్ లక్ష్మి ఒకరు. అయితే ఛాన్సులు రావడం లేదట. పట్టువదలని విక్రమార్కుడిలా లక్ష్మి మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉందట. అటు తమిళంలో గానీ ఇటు తెలుగులో గాని అవకాశాలు రాకపోవడంతో లక్ష్మి ఏ మాత్రం నిరుత్సాహపడకుండా డైరక్టర్ల వెంటపడుతూ తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉందట.