యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న. చరణ్ పుట్టినరోజు నాడు 'ఆర్ఆర్ఆర్' టీమ్ వీడియో రిలీజ్ చేసినట్టుగా ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు కూడా 'ఆర్ఆర్ఆర్' టీమ్ వీడియో రిలీజ్ చేస్తుంది అంటూ ప్రచారం జరిగింది. కొన్ని రోజులు ఎన్టీఆర్ బర్త్ డేకి జక్కన్న వీడియో రిలీజ్ చేస్తారని.. కాదు రిలీజ్ చేయలేరని ఇలా వార్తలు వచ్చాయి. ప్రచారంలో ఉన్న ఆ వార్తలకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
ప్రతి ఏటా పుట్టినరోజున మీరు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ, అధికారుల సూచనలను పాటిస్తూ భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం.
ఏంటా గిఫ్ట్ అంటారా..? ఫలక్‌నామా దాస్, హిట్ చిత్రాలతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు విశ్వక్‌సేన్. ఈ యువ హీరో ఎన్టీఆర్ అభిమాని. అందుచేత ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ రాప్ సాంగ్ విడుదల చేస్తున్నాడు. 'మాస్ కా దాస్, మాస్ కా బాప్' పేరుతో సాగే ఈ పాట ఉంటుందని తెలిసింది.