ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. జాగర్లమూడి క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సక్సస్‌ఫుల్‌గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ నటించడంతో పాటు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాలో అక్కినేని పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అయితే.. ఈ పాత్రను ఎవరు పోషించనున్నారు అనేది గత కొన్ని రోజులు నుంచి ఆసక్తిగా మారింది. నాగార్జున, నాగచైతన్య ఇద్దరిలో ఎవరో ఒకరు నటిస్తారని ప్రచారం జరిగింది.
ఆ తర్వాత సుమంత్ నటించనున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి. ఎట్టేకేలకు ఎన్టీఆర్ బయోపిక్‌లో అక్కినేనిగా సుమంత్ నటించనున్నాడని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. అయితే... ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి కొంతమంది అక్కినేని అభిమానులు ట్విట్టర్లో స్పందిస్తూ... సుమంత్... అక్కినేనిగా మీరేంటి? అక్కినేని ఆత్మ ఘోషిస్తుంటుంది అని కామెంట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే... అక్కినేనికి, బాలయ్యకి మధ్య ఓ ఫంక్షన్‌లో మాటామాటా పెరగడం... ఆ తర్వాత రెండు ఫ్యామీలిలకి మధ్య మాటలు లేకపోవడం జరిగింది. మరి... ఈ వార్తలపై సుమంత్ ఏమన్నా స్పందిస్తాడేమో చూడాలి.