మూడో భార్యతో కలిసి హాలిడే టూర్‌కు వెళ్ళనున్న పవన్ కళ్యాణ్!

శుక్రవారం, 6 మే 2016 (21:04 IST)
ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న హీరో పవన్‌ కల్యాణ్‌ కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు. తన మూడో భార్య అన్నా లేజ్నోవా, చిన్న కూతురుతో కలిసి ఓ హాలిడే టూర్‌ని ప్లాన్‌ చేశాడు. 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' చిత్రం ఇచ్చిన ఫలితాలతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని హాలిడే ట్రిప్‌ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. 
 
కానీ ఎక్కడికి వెళుతున్నారు.. ఎప్పుడు వెళుతున్నారు అనే విషయాలను మాత్రం పవన్‌ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ట్రిప్‌ నుంచి తిరిగి వచ్చాక పవన్‌.. ఎస్‌.జే.సూర్య దర్శకత్వంలో చేయనున్న సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌‌ని మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి