తమ్ముళ్ల ప్రేమకు అన్నయ్య త్యాగానికి రాయలసీమ ఫ్యాక్షన్ కోటింగ్...

బుధవారం, 18 జనవరి 2017 (06:16 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'కాటమరాయుడు'. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహిస్తుండగా శరత్ మరార్ నిర్మాత. శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రానికి సంబంధించిన కథ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పైగా, ఈ చిత్రంలో పవన్‌కు సోదరులుగా నటించే నటీనటుల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నారు. అసలు కథలోకి వెళ్తే... 
 
'కాటమరాయుడు' కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో.. ఓ స్టోరీ హల్ చల్ చేస్తోంది. అదేటంటే.. తమ్ముళ్ల కోసం అన్నయ్య చేసిన త్యాగమే కాటమరాయుడు కథ అంటున్నారు. దీనికి రాయలసీమ ఫ్యాక్షన్ కోటింగ్ కొట్టారట. ఇందులో పవన్‌కి నలుగురు తమ్ముళ్లు. ఆ పాత్రల్లో కమల్ కామరాజు, విజయ్ దేవరకొండ, శివబాలాజీ, అజయ్‌లు నటించారు.
 
తమ్ముళ్ల బాగోగుల కోసం అన్నయ్య ఎలాంటి త్యాగానికైనా వెనకాడడు. ఈ క్రమంలోనే పెళ్లి వయసు కూడా దాటిపోతోంది. మరోవైపు, తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడి.. పెళ్లికి రెడీ అవుతారు. తమ్ముళ్ళు తమ పెళ్లిళ్ల కోసం అన్నయ్యని ప్రేమలోకి దించే ప్రయత్నాలు చేస్తారు తమ్ముళ్లు. అయితే, తెరపై ఆ సన్నివేశాలు భలేగుంటాయట. సింపుల్‌గా కథ ఇదేనని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి