కానీ ఆ తర్వాత చిరంజీవి సినిమాకానీ, మహేష్ బాబు సినిమా కానీ, ప్రభాస్ సినిమా కానీ రి రిలీజ్ చేస్తే పెద్దగా ఆదరణ లేదు. అప్పటికే ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టడం, దాని వల్ల ఏదో ఉపయోగం అయిందనుకున్నా వ్రుధా ప్రయాస అయిందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్లకు మోసగాడు 4డి లో విడుదలై కాస్తో కూస్తో డబ్బులు రాబట్టింది.
ఇప్పటికే ఆయా హీరోల సినిమాలు పలుసార్లు టీవీల్లో రావడం వల్ల కావచ్చు. చూసిన సినిమానే మరలా డబ్బు పెట్టి చూడ్డం ఎందుకనుకున్నారో ఒకటి రెండు హీరోల సినిమాల మినహా పెద్దగా ఆదరణ లభించలేదని ఎగ్జిబిటర్లు కూడా తెలియజేస్తున్నారు. పరిమితంగా కొన్ని థియేటర్లలో విడుదల చేయడం అందుకు ఫ్యాన్స్ హంగామా చేయడం మినహా థియేటర్ యాజమాన్యానికి ఒరిగింది లేదని తెలుస్తోంది.
రిరిలీజ్ సినిమాలు విడుదల ట్రెండ్ నడుస్తున్నప్పుడు సరైన సినిమాలు థియేటర్లలో రాకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందని ఎగ్జిబిటర్లు తెలియజేస్తున్నారు. సో.. ఇకపై రి రిలీజ్ సినిమాలు ట్రెోండ్ కు ఫుల్ స్టాప్ పడుతుందో మో చూడాలి. తాజాగా రజనీకాంత్ ముత్తు సినిమా విడుదల కాబోతుంది. బాలక్రిష్ణ సినిమా ఆ మధ్య రిలీజ్ అయితే పెద్దగా చూసిన వారు లేరు. కనుక ఈ ట్రెండ్ ఎంత కాలం వుంటుందో కాలమే నిర్ణయించాలి.