ఈ నేపథ్యంలో తరుణ్ పెళ్లి ఫిక్సయిందని వార్తలొస్తున్నాయి. దీనిపై అసలు సంగతి ఏంటా అని ఆరాతీస్తే.. ఇది ఇప్పటి వార్త కాదు. తరుణ్, ప్రియమణి కలిసి నటించిన 'నవవసంతం' సినిమా తర్వాతి సంగతి. ప్రియమణి ఇటీవల అలీ నిర్వహించే ఓ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా 'నీ మీద వచ్చిన భయంకరమైన గ్యాసిప్ ఏంటి' అని ప్రియమణిని అలీ అడిగాడు.
అందుకు ప్రియమణి సమాధానం ఇస్తూ.. సినిమాలతోనే బిజీగా గడుపుతున్న రోజుల్లో.. ఓ తమిళ జర్నలిస్ట్ తనకు ఫోన్ చేసి.. మీకు హీరో తరుణ్‌తో పెళ్ళి ఫిక్సయిందట కదా అని అడిగాడు. అంతేకాదు.. ఆయన మీకు ఓ లగ్జరీ కారు గిఫ్టుగా ఇచ్చారట కదా అని అడిగాడు. అంతే తనకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇంటికి వెళ్లి ఏడ్చేశాను. అప్పుడు మా నాన్న ధైర్యం చెప్పారని ప్రియమణి తెలిపింది. నిజానికి అప్పటికి ప్రియమణికి ఇన్నోవా కారు మాత్రమే ఉండేదని చెప్పుకొచ్చింది. ఇది తరుణ్-ప్రియమణిల పెళ్లి కథ..