కబాలీ సీక్వెల్‌లో రజనీకాంత్ రియల్ లుక్.. బట్టతలతో కనిపిస్తారా?

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (09:16 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి సినిమాలో వెరైటీ లుక్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ లుక్‌తో రజనీకాంత్ మంచి క్రేజ్ వచ్చింది. ఇదే తరహాలోనే కబాలి సీక్వెల్‌లోనూ రజనీకాంత్ రియల్ లుక్‌లో కనిపిస్తారని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఆన్ స్ర్కీన్‌పై గ్లామరస్‌గా కనిపించే సూపర్ స్టార్... బయట మాత్రం తన రియల్ లుక్ అయిన బట్టతలతో కనిపించేందుకే ఎక్కువ ఇష్టపడుతుంటారు. 
 
కానీ రజనీకాంత్‌ను రిజనల్ లుక్‌లో చూపించేందుకు ఇప్పటి వరకు ఏ దర్శకులు కూడా ముందుకు రాలేదు. అయితే కబాలి సీక్వెల్‌గా తెరకెక్కబోయే సినిమాలో రజనీకాంత్ తన రియల్ లుక్కులో కనిపించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం కొత్త టైటిల్ వేటలో దర్శకుడు పా. రంజిత్ బిజీ బిజీగా ఉన్నాడు. రజనీ అల్లుడు ధనుష్ ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహించనున్నాడు. సో.. కబాలి సీక్వెల్‌లో రజనీకాంత్ బట్టతలతో కనిపిస్తాడని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి