వంగవీటి మోహనరంగా జీవిత కథ ఆధారంగా రాంగోపాల్ వర్మ 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో వంగవీటి రత్నకుమారి పాత్రకి ప్రముఖ బుల్లితెర నటి నైనా గంగూలీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'వంగవీటి రంగాని చంపిన తర్వాతే వంగవీటి రత్నకుమారి వెలుగులోకి వచ్చారు. వంగవీటి హత్య జరగకముందు ఆమె అనుభవించిన భావోద్వేగాలని అభినయించగలిగే నటి కోసం బాగా అన్వేషించాను.