శంక‌ర్‌, రామ్‌చ‌ర‌ణ్ సినిమాలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, స‌ల్మాన్‌!

శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (17:43 IST)
Sankar, ramaharan
ఇటీవ‌లే త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ష‌ణ్ముగ‌మ్ తో తాను కొత్త సినిమా చేస్తున్న‌ట్లు నిర్మాత దిల్ రాజు ప్ర‌క‌టించాడు. అందులో రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడు. ఈ చిత్రం చేయ‌డం త‌న‌కెంతో సంతోషం క‌లిగించింద‌ని ఇంత ఆనందం ఎప్పుడూ క‌లిగించ‌లేద‌ని దిల్ రాజు ప్ర‌క‌టించాడు. కాగా, ఇప్పుడు కొత్త విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. పాన్ ఇండియా సినిమా రూపొంద‌నున్న ఈ సినిమా స‌మ‌కాలీన రాజ‌కీయ నేప‌థ్యంలో వుంటుంద‌ని తెలుస్తోంది. క‌నుక ఇందులో భాష కొక న‌టుడ్ని ఇందులో ఎంపిక చేసే ప‌నిలో వున్న‌ట్లు చిత్ర యూనిట్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి.
 
విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే దిల్‌రాజు వ‌కీల్‌సాబ్ సినిమా విజ‌య స‌భ‌లో మాట్లాడుతూ, రెండో వారంలో వ‌కీల్‌సాబ్ క‌లెక్ష‌న్లు బాగున్నాయి. ప‌వ‌న్‌గారితో ఈ సినిమా చేయ‌డం చాలా ల‌క్క్‌గా భావిస్తున్న‌ట్లు చెప్పారు. అయితే మ‌రోసారి ఆయ‌న‌తో న‌టించే విష‌యం గురించి చెబుతూ, ఇది వ‌ర‌కు ఆయ‌న‌ను క‌ల‌వాలంటే మ‌ధ్య‌వ‌ర్తి అవ‌స‌రం. కానీ వ‌కీల్‌సాబ్ త‌ర్వాత నేరుగా క‌లిసే ఛాన్స్ వ‌చ్చేసింది. క‌నుక ప‌వ‌న్‌సార్‌కు స‌రిప‌డే క‌థ వుంటే వెంట‌నే ఆయ‌న‌కు చెబుతాను అని అన్నాడు. అయితే ఆ సినిమా కూడా వేణుశ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తే బాగుంటుంద‌న్నాడు.

కానీ స‌మాచారం మేర‌కు శంక‌ర్ సినిమాలో కీల‌క పాత్ర‌ను తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గా, బాలీవుడ్‌లో స‌ల్మాన్‌ఖాన్‌ను, క‌న్న‌డ‌లో సుదీప్‌, ఉపేంద్ర పేర్లు ప‌రిశీల‌న‌లో వున్నాయి. కాగా, మ‌ల‌యాళ వ‌ర్ష‌న్‌లో మాత్రం ఇంకా ఎవ‌రి పేరు బ‌య‌ట‌కు రాలేదు. సో. పేన్ ఇండియా మూవీగా అంద‌రూ ఆశ్చ‌ర్య ప‌రిచేవిధంగా వుండే క‌థ‌క‌నుక ఈ ప్రాజెక్ట్‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ట్లు దిల్ రాజు తెలియజేస్తున్నాడు. సో. క‌రోనా సెకండ్‌వేవ్ త‌గ్గాక ఈ సినిమా గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు