బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఫేమస్ అయిన ముద్దుగుమ్మ ఎల్లి అవరామ్. బిగ్‌బాస్ హౌస్‌లో అత్యంత అందగత్తెగా ఈ అమ్మడికి పేరొచ్చింది. ఆ గుర్తింపుతోనే ''మిక్కీ వైరస్''’ అనే సినిమాలో కథానాయికగా అవకాశం అందుకుంది. ఇదే బాలీవుడ్‌లో ఆమె తొలిసినిమా. ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాల్ని అందుకుంటోందీ ఎల్లి. ఓ వైపు రియాలిటీ షోతో బిజీగా ఉంటూనే స్క్రిప్టులు వింటోంది. అయితే ఈ భామ కన్ను సల్మాన్ భాయ్‌పై పడిందని బాలీవుడ్‌లో ప్రచారమవుతోంది.
బిగ్‌బాస్ హోస్ట్‌గా సల్మాన్ క్రేజు చూసిన ఎల్లీ ఈ కండలవీరుడిపై మనసు పారేసుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీంతో కొందరు ఈ భామని ముద్దుగా ''మిసెస్ సల్మాన్ ఖాన్'' అని అమ్మడిని పొగిడేసేసరికి.. ఉబ్బితబ్బిబ్బయిపోతోంది ఈ ముద్దుగుమ్మ. కాగా ఈ భామ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ఇటీవలకాలంలో ఈ భామకి అవకాశాలు కనుమరుగయ్యాయి. అయితే బాలీవుడ్ అవకాశాలను కొల్లగొట్టాలంటే ఉన్న ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్న ఎల్లి, బికినీ సూట్‌లో అందాలు ఆరబోసింది. ఎలాగైనా బాలీవుడ్‌లో పాగా వేయాలన్న లక్ష్యంతో సౌందర్యాలను బయటపెట్టిన ఎల్లి అవరామ్, ఎంతవరకు అవకాశాలను అందిపుచ్చుకుంటుందో వేచి చూడాలి.