సినిమా సెలబ్రిటీలు దాక్కుని దాక్కుని వెళుతున్నా వాళ్లను పసిగట్టేస్తుంది మీడియా. ఈమధ్య టాలీవుడ్ హీరోయిన్ ఒకరు తరచూ బెంగళూరు శివారులో తను నిర్మించుకున్న ఫార్మ్ హౌసుకు వెళ్లి వస్తోందట. వీకెండ్ అయితే చాలు అక్కడికి వెళ్లిపోతోందట. అంతేకాదు... ఆమె కోసం ఓ విదేశీ క్రికెటర్ దాదాపుగా రెండుమూడు నెలలుగా ఇక్కడే తిష్ట వేసి వున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం సదరు హీరోయిన్ అతడితో ఎంజాయ్ చేస్తోందట.
ఐతే ఈ విషయాన్ని పసిగట్టారని తెలుసుకున్న సదరు హీరోయిన్ గత వీకెండ్లో తన రూటు మార్చి తన వెంట మరో నలుగురైదుర్ని వెంటబెట్టుకుని వెళ్లిందట. క్లోజుగా వున్నవారు ఆమె పట్ల అనుమానంగా చూస్తే... అదేమీ లేదు, పార్టీలు చేసుకోవడం తనకు కాలేజ్ డేస్ నుంచే అలవాటనీ, అంతేతప్ప మరేమీ లేదని అంటోందట. మరి ఆ విదేశీ క్రికెటర్ ఇక్కడెందుకు వున్నట్లు అని అడిగితే మాత్రం సమాధానం చెప్పడంలేదట. విషయం ఏంటో మరి.