అందుకు త్రిష 'ఒకే ఒక్కడు' అని ట్వీట్ చేశాడు. పవన్ కల్యాణ్ ఆయన శైలిలో ఆయన జీవిస్తారని పేర్కొంది. స్టార్‌డమ్‌కు పవన్ దూరంగా చాలా సింపుల్‌గా హుందాగా ఉంటారని చెప్పింది. ఇంకా తనకు ఐస్‌క్రీం అంటే చాలా ఇష్టమని, ఇటీవల వచ్చిన సినిమాల్లో తనకు సుల్తాన్ హిందీ చిత్రం నచ్చిందని చెప్పింది.
'మిమ్మల్ని ఏ ప్రశ్న అడిగితే ఇష్టం ఉండదు?' అని తన అభిమాని వేసిన ప్రశ్నకు తనను ఎవరయినా పెళ్లెప్పుడు చేసుకుంటావ్? అని అడిగితే ఆ ప్రశ్న ఇష్టం ఉండదని సమాధానం చెప్పింది. హీరో మహేష్‌బాబు గురించి అడిగిన ప్రశ్నకు... వృత్తిపై అంకితభావం కలిగిన స్వీట్ సూపర్‌స్టార్ అని త్రిష పొగడ్తల వర్షాన్ని కురిపించింది.