ఆనంద్ దేవరకొండతో 'డ్యూయెట్' కోసం రెడీ అవుతున్న బేబి

సోమవారం, 9 అక్టోబరు 2023 (14:32 IST)
వైష్ణవీ చైతన్య ..'బేబి' సినిమాతో తను స్టార్ డమ్‌ను సంపాదించుకుంది. తాజాగా ఆమె ఆనంద్ దేవరకొండ జోడీగా 'డ్యూయెట్' అనే సినిమా చేయడానికి ఒప్పుకుందని టాక్.
 
ఆనంద్ దేవరకొండ హీరోగా మిథున్ అనే యువకుడు ఒక ప్రేమకథా చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం బేబీ హీరోయినే కరెక్ట్ అని ఆమెను సంప్రదించనట్లు తెలుస్తోంది. వైష్ణవీ చైతన్య అయితేనే ఆ పాత్రకి కరెక్టుగా సెట్ అవుతుందని ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
 
మిథున్ దర్శకత్వంలో యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి సినిమా తెరకెక్కనుంది. దసరాకి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు