మెగా హీరోతో మూవీ ప్లాన్ చేస్తోన్న నాగ శౌర్య డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..? ఛలో ఫేమ్ వెంకీ కుడుముల. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఛలో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయం సాధించింది. నాగశౌర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించటంతో బడా నిర్మాణ సంస్థల దృష్టిలో పడ్డాడు వెంకీ.
తాజాగా ఈ యువ దర్శకుడు మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో మూవీ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత‍్వంలో తేజ్ ఐ లవ్ యు సినిమా చేస్తున్నాడు. సాయి ధరమ్ తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంతవరకు ప్రకటించలేదు. కిశోర్ తిరుమల, చంద్రశేఖర్ ఏలేటి, గోపిచంద్ మలినేని దర్శకులతో చర్చలు జరగుతున్నట్టుగా తెలుస్తోంది.