ఈ సందర్భంగా దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ, మేము అనుకున్న కాన్సెప్ట్ ను ఉన్నది వున్నట్లుగా చాలా చక్కాగా తీశాము.రవి గారు నాకు అన్ని విభాగాల్లో వుంటూ నాకు చాలా సపోర్ట్ చేశారు. .రవి గారికి చాలా థాంక్స్. హన్సిక గారి గురించి చెప్పాలంటే తాను డే వన్ నుండి షూటింగ్ అయిపోయే వరకు తను చాలా కష్టపడింది.ప్రతి షార్ట్ ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు ఉన్నాకూడా నో అనకుండా చేసింది. మేము సింగల్ షార్ట్ లో చేస్తే హన్సిక గారు ప్రతి షార్ట్ సింగల్ టేక్ లో చేశారు..అలా చేసినందుకే సినిమా తొందరగా పూర్తి చేశాము. అందుకు హన్సిక గారికి ధన్యవాదాలు. యూనిట్ సబ్యులందరూ మేము చేసే ప్రతి పనికి చాలా సపోర్ట్ చేసి మాకు సహకరించారు.
హన్సిక మోత్వాని మాట్లాడుతూ, నా కెరీర్ లో నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలలోకి ఈ సినిమా చాలా టప్ గా అనిపించింది. దర్శకుడు నాకు ఎం చెప్పాడో అదే ఉన్నది ఉన్నట్లు చాలా చక్కగా తీశాడు. నిర్మాతలు మంచి కథను సెలెక్ట్ చేసుకొని ఎక్సపెరర్మెంటల్ గా తీశారు. కెరారామెన్ కిశోర్, రవి గార్లు నేను ఇరవై నిమిషాల రెయిన్ షాట్ ఉన్నాకూడా వారు నాతో ఉండి అద్భుతంగా చేశారు. టీం అంతా చాలా కష్టపడి పని చేసిన ఈ సినిమా గొప్ప విజయం సాధించి దర్శక,నిర్మాతలకు, చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు.
నిర్మాత బొమ్మక్ శివ మాట్లాడుతూ, మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకున్న మేము ఇంత తొందరగా సినిమా షూట్ పూర్తి చేస్తాము అనుకోలేదు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసిన హన్సిక స్టార్ హీరోయిన్ అయ్యి ఉండి కూడా తను ఎంతో డెడికేటెడ్ గా దర్శకుడు చెప్పిన ప్రతి షార్ట్ కూడా సింగల్ టేక్ లో చేయడం వలన మేము ఈ సినిమాను కేవలం ఆరు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాము.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో పప్రేక్షకుల ముందుకు వస్తున్న మా "105 మినిట్స్" చిత్రం ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.