1995 Vaishalyapuramlo Oorvasi
ఎస్వీ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై నిర్మాతలు టి.వేణుగోపాల్, సతీష్ నిర్మిస్తున్న చిత్రం 1995 వైశాల్యపురంలో ఊర్వశి. గోవింద్ శర్మన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బండి శ్రీనివాస్ సహకారంతో రూపొందిస్తున్న ఈమూవీలో శుక్రాంత్, అను వర్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.