సినీ ఇండస్ట్రీలో లివింగ్ రిలేషన్‌షిప్ ఉంది.. చిరంజీవి... : ఆర్కే రోజా

శుక్రవారం, 4 మే 2018 (15:23 IST)
సీనియర్ సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ దుమారం చెలరేగుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, లివింగ్ రిలేషన్‌షిప్ ఉందని వ్యాఖ్యానించారు.
 
ఆమె ఓ వెబ్‌ మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరోయిన్లు ప్రేమలో పడటం కామన్ అని చెప్పుకొచ్చారు. తన జీవితంలో అన్నీ అనుకోకుండానే జరిగిపోయాయని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే, తాను అనుకోకుండానే హీరోయిన్ అయ్యానని, అనుకోకుండానే పొలిటీషియన్ అయ్యానని చెప్పారు. 
 
ఇకపోతే, తాను చదువుకునే రోజుల్లో నుంచే చిరంజీవి, నాగార్జున అంటే పిచ్చి అభిమామన్నారు. చిరంజీవితో మూడు సినిమాలు చేశానని, ఆయన తనకు బాస్ అని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజమేనని... 'రాజకీయాలకు ఆయన పనికిరాడు' అని తాను అన్నప్పుడు చిరంజీవి కూడా బాధపడే ఉంటారని రోజా ఓ ప్రశ్నకు బదులిచ్చింది. 
 
ఇకపోతే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారని... బాలకృష్ణ, హరికృష్ణలకు కూడా అవసరం తీరిపోయాక పంగనామాలు పెట్టారని రోజా విమర్శించారు. మళ్లీ అవసరం వచ్చాక బాలకృష్ణ కూతురును కోడలు చేసుకున్నారని, జూనియర్ ఎన్టీఆర్‌కు తన బంధువుల అమ్మాయిని ఇచ్చి పెళ్లి జరిపించారని ఆమె గుర్తుచేశారు. 
 
పవన్ కల్యాణ్ టాప్ హీరోల్లో ఒకరని... అయితే రాజకీయాల్లో నెగ్గి ఆయన అధికారంలోకి వస్తారని తాను భావించడం లేదని... కానీ, రాజకీయాలను మాత్రం ప్రభావితం చేయగ శక్తి ఆయనలో ఉందన్నారు. అదేవిధంగా వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిలను ఉద్దేశించి సోషల్ మీడియాలో చాలా దారుణంగా రాశారని... ఆవిడ ఎత్తు ఎదిగిన పిల్లలు ఆమెకు ఉన్నారని... ఆమె కుటుంబం బాధపడేలా టీడీపీవారు దారుణమైన ప్రచారం చేశారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు