మలయాళ సినీనటిపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడు, సినీ నటుడు దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కేరళ హై కోర్టు ఆమోదించింది. 86 రోజుల రిమాండ్ తర్వాత ఎట్టకేలకు దిలీప్‌కి బెయిల్ మంజూరయ్యింది. ఫిబ్రవరి 17న మళయాల నటిపై లైంగిక దాడికి సంబంధించి అతనిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ దక్షిణాది హీరోయిన్.. లైంగిక వేధింపులకు గురైన భావన, తన వివాహాన్ని వాయిదా వేసుకుంది.
ప్రియుడు నవీన్‌తో పెళ్లికి సిద్ధమై, నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకుని, 26వ తేదీన పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ఒకటవ్వాలని నిర్ణయించుకున్న ఈ జంట అనూహ్యంగా ఇప్పుడు పెళ్లిని వాయిదా వేసుకుంది. ఈ విషయాన్ని భావనే స్వయంగా వెల్లడించింది. పెళ్లి వాయిదా కారణాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. చేతిలో ఉన్న కొన్ని సినిమాలు వున్నందునే ఈ పెళ్లి వాయిదా పడిందని చెప్తున్నారు. లేకుంటే ఇతర కారణమైందా అనేది తెలియాల్సి వుంది.
లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హీరో దిలీప్ ఇటీవల బెయిల్ పై విడుదల కాగా, నిర్మాత నవీన్ ద్వారా ఈ కేసు నుండి భావనను ఉపసంహరించుకోవాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణం వలనే భావన పెళ్లి వాయిదా పడినట్లుగా ప్రచారం సాగుతోంది.