మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ప్రముఖ నటి కస్తూరి తన మనసులోని మాటను బయటపెట్టింది. ‘భారతీయుడు’ చిత్రంలో ప్రముఖ నటుడు కమలహాసన్‌కు చెల్లెలుగా, ‘అన్నమయ్య’ చిత్రంలో నాగార్జున సరసన నాయికగా నటించిన విషయం తెల్సిందే.
అలాగే, తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో నటించే అవకాశం తనకు దక్కలేదని, ఆ అవకాశం ఇకపై వస్తుందని కూడా తాను భావించడం లేదని వ్యాఖ్యానించింది. కాగా, 'భారతీయుడు' చిత్రంలోని ‘పచ్చని చిలుకలు తోడుంటే..’ అనే పాటలో కమల్‌తో ఆడిపాడే కస్తూరిగా ప్రేక్షకుల మదిలో ఆమె గుర్తుండిపోయింది.