రిలేషన్‌లో ఉన్న ప్రియుడితో రత్తాలు ఎంగేజ్మెంట్!

బుధవారం, 7 ఏప్రియల్ 2021 (09:10 IST)
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ లక్ష్మీరాయ్ అలియాస్ రాయ్‌లక్ష్మీ. ఈమె తన మనసుకు నచ్చిన వ్యక్తితో రిలేషన్‌లో కొనసాగుతున్నారు. ఇపుడు ఆయన్ను వివాహం చేసుకోనున్నారు.
 
ఇందుకోసం ఈ నెల 27వ తేదీన నిశ్చితార్థం జరుగనుందని ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. చాలా కాలంగా పెళ్లి ఎప్పుడన్న విషయమై తనను ఎందరో ప్రశ్నిస్తున్నారని, తానేమీ దాచుకోవాలని భావించడం లేదని, నేను ఇప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, 27న నిశ్చితార్థం జరుగనుందని తెలిపింది.
 
ఇందుకు సంబంధించిన ఇన్విటేషన్లను ఇప్పటికే సన్నిహితులకు పంపించానని, ఇది ముందుగా ప్రణాళిక ప్రకారం జరిగింది కాదని, అనుకోకుండా నిశ్చయమై పోయిందని పేర్కొంది. తన ప్రియుడితో జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధమవుతున్నానని, తన వివాహ నిశ్చయంపై బంధు మిత్రులంతా సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు