ముఖ్యంగా చెప్పవలసిన ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసిన అబ్బాయి పాణిని అని ఉన్నాడు. నాసాలో పని చేస్తున్నాడు. అతను ఆస్ట్రో ఫిజిసిస్ట్. గొప్ప శాస్త్రవేత్త. ఇద్దరు కొలీగ్స్ తో కలిసి ఇంతవరకు ప్రపంచంలో వచ్చిన టైమ్ మెషీన్ కథలన్నీ తీసుకుని ఒక ప్రాజెక్ట్ చేశారు. స్పీల్ బర్గ్ 'బ్యాక్ టు ఫ్యూచర్'తో సహా అన్ని కథలు తీసుకున్నారు. లైట్, క్వాంటమ్ థియరీ వాటి ప్రకారం చూసి, 'ఆదిత్య 369' టైమ్ మెషీన్ అనేటటువంటిది బెస్ట్ అని నిర్ణయించారు. ఎందుకు? అంటే వాళ్ళు చెప్పింది ఏమిటంటే, "స్పీల్ బర్గ్ సినిమాలో కార్లు అలా స్పేస్ లో వెళ్లిపోయి మాయమవుతాయి. టైమ్ మెషీన్ టైమ్ లో ట్రావెల్ చేస్తుంది గానీ స్పేస్ లో కాదు. 'ఆదిత్య 369'ల టైమ్ మెషీన్ వర్టికల్ యాక్సెస్ లో అలా తిరిగి తిరిగి మాయమవుతుంది' అని.