Dacoit Fire Glimpses poster
అడివి శేష్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ గ్లింప్స్ తెలుగు, హిందీలో రిలీజ్ అయ్యింది. ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ తో ఫైర్ గ్లింప్స్ అదిరిపోయింది. శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య ఉద్రిక్త క్షణంలో గ్లింప్స్ ప్రారంభమౌతోంది. సానుభూతితో నిండిన వాయిస్ లో శేష్ ఆమెను "జూలియట్" అని పిలుస్తాడు, అందరూ ఆమెకు అన్యాయం చేశారని చెబుతాడు. కానీ వెంటనే అతని వాయిస్ మారుతుంది. నేను నిన్ను మోసగించడానికి రాలేదు, అంతకంటే ఎక్కువ చేస్తా అని మిస్టీరియస్ స్మైల్ తో శేష్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది.