టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మంచి హిట్ కోసం కథల ఎంపికలో జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే ఫ్లాప్ టాక్స్ సంపాదించుకున్న తన సినిమాలు కలెక్షన్లు తెచ్చిపెడుతున్నా.. ఇక తప్పకుండా హిట్ కొట్టాల్సిందేనని ప్రిన్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి సినిమాను కొత్త పంథాలో ఎంచుకుంటున్నారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "భరత్ అనే నేను" రాజకీయం నేపథ్యంలో సాగబోతోంది.