ఆస్ట్రేలియాలో ఐష్- జాతీయ గీతాన్ని ఆలపించిన ఆరాధ్య.. (Video)

ఆదివారం, 13 ఆగస్టు 2017 (15:44 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ దేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆస్ట్రేలియాలో జరుపుకున్నారు. ఈ వేడుకలో ఐశ్వర్యారాయ్ కుమార్తె ఆరాధ్య కూడా పాల్గొన్నారు. జాతీయ పతాకం ఎగురవేసిన వేళ ఆరాధ్య జాతీయ గీతాన్ని పాడి అదరగొట్టింది. దీంతో అనేకమంది ఆరాధ్యను ప్రశంసించారు. ఆపై తల్లీకుమార్తెలు జాతీయ పతాకాన్ని ఎగురువేశారు. 
 
కాగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ఐశ్వర్యారాయ్ 2007వ సంవత్సరం.. బిగ్ బి అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మాజీ ప్రపంచ సుందరి అయిన ఐష్..‌ ఏక్ దిల్ హై ముష్కిల్ అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఐష్ అందాల ఆరబోసిన సంగతి విదితమే.

 

వెబ్దునియా పై చదవండి