శనివారం రాత్రి శిల్పకళా వేదికలో జరిగిన అఖండ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, నందమూరి రామారావు కుటుంబం మా తాత గారి నుంచి మంచి అనుబంధం వుండేది. మా ఇరు కుటుంబాలవారు ఒకే కుటుంబంలా వుండేవాళ్ళం. బాలకృష్ణగారిని 12 ఏళ్ళనాడు ఓ ఫంక్షన్‌లో చూశా. ఆ రాత్రంతా నాకు ఆయనే గుర్తుకు వచ్చారు. చుట్టూ ఎంతో మంది వున్నా ఏమి పట్టించుకోకుండా ఎంత ఆనందంగా వుండగలగుతున్నారో. అది అందరికీ సాధ్యం కాదు. ఆయనలో ఇంత ఎనర్జీ ఎలా వుంటుంది అని ఆలోచించాను. ఆయన చేసిన కష్టం, కృషి ఇందుకు కారణమని అనుకున్నాం.
నాకు బాలకృష్ణగారిలో నచ్చేవి రెండే రెండు. అడిక్షన్, డిక్షన్. మాట విరుపులు, పేజీలకొద్దీ డైలాగ్‌లు మాట్లాడడం. ఒక్క ఎన్.టి.ఆర్ .తర్వాత మరలా బాలకృష్ణగారికే చెల్లుతుంది. ఆయనలా ఎవ్వరూ అలా డైలాగ్‌లు చెప్పలేరు. డిసెంబర్2న ఆయన సినిమా విడుదలవుతుంది. రెండు వారాలకు పుష్ప, ఆ తర్వాత మరో సినిమా ఇలా అన్నీ విజయంసాధించాలి.