ది డెవిల్ అనే పిలవబడే రా చీఫ్ కల్నల్ మహాదేవ్ ఈ పనిని రికీకి అప్పగిస్తాడు. ఈ క్రమంలో రికీ రహస్యంగా ఈ పనిని పూర్తి చేసే పనిలో ఉంటాడు. మరో వైపు ధర్మ అలియాస్ గాడ్ అనే మాజీ రా ఏజెంట్ భారతదేశాన్ని నాశనం చేయటానికి పథకం వేస్తాడు. మిషన్ అనుకోని మలుపులు తీసుకుంటుంది. దీంతో ఏం జరుగుతుందో చూడాలనుకుంటున్న ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటుతాయి.
ఏజెంట్ చిత్రంలో అఖిల్ అక్కినేనితో పాటు మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, డెంజిల్ స్మిత్, విక్రమ్‌జీత్ విర్క్ తదితరులు నటించారు. వీరు తమ నటనతో సినిమాను మరింత ఆసక్తికరంగా మలిచారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందించిన కథకు దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాకు స్క్రీన్‌ప్లేను కూడా రచించారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.